Konapur bridge | సారంగాపూర్, మార్చి 13 : సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులోని ప్రదాన రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు ఆగిపోయాయని, వెంటనే ఆ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకుపెంబట్ల-కోనాపూర్ గ్రామాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు బ్రిడ్జి వద్ద రోడ్డుపై శుక్రవారం బైటాయించి ధర్నా నిర్వహించారు. బ్రిడ్జి పనులు పూర్తి అయిన రెండు వైపుల అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టకపోవడంతో రోడ్డు గుంతల మయంగా మారి ఇబ్బందులు పడుతున్నమని సంబందిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మండల కేంద్రానికి వస్తుండగా ధర్నా చేస్తున్న ప్రాంతంలో అగి సమస్యను అడిగి తెల్సుకున్నారు. సంబందిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హమి ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో పెంబట్ల, కోనాపూర్ గ్రామాల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.