establishment of bus stop | మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 22: సర్వీస్ రోడ్డు వేయడానికి, బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మానకొండూర్ మండలం ఈదుల గట్టెపల్లి గ్రామంకు నేషనల్ హైవే 563 రోడ్డు వెడల్పులో భాగంగా కరీంనగర్ నుండి వరంగల్‌కు వెళ్లేందుకు ఈ గ్రామానికి సైడ్ 59, చైనేజ్ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణానికి ఈదుల గట్టుపల్లి లోపలికి, బయటికి వెళ్లేందుకు దాదాపు 2 కి.మీ దూరం యూటర్న్ కావాల్సి వస్తుందని, సర్వీస్ రోడ్డు, బస్సు స్టాప్ లేని కారణంగా ఆర్.టి.సిలు ఆపడం లేదని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ నెల 20న నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్ కు, అధికారులకులకు వినతి పత్రాన్ని సమర్పించినట్లు వివరించారు. మేము ఈ సమస్యను అధికారులు తీసుకువచ్చినట్లు, అయినప్పటికీ ఎవ్వరూ ఏమి చేయని కారణంగానే తాము పార్టీలకు అతీతంగా రొడ్డెక్కి నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుందని వాపోయారు. నిరసన వ్యక్తం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, వారిని అక్కడి నుండి పంపించి వేశారు.ఇప్పటికైన మా సర్వీస్ రోడ్డును, బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుకున్నట్లు తెలిపారు.