Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, జూలై 30 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని కూనారం పెద్దచెరువు మత్తడి పడి గ్రామం మధ్యలో ఉన్న జగదాంబ లోలెవల్ బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తోంది. దీంతో మంగపేట- కూనారం గ్రామాల మధ్య గురువారం రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే ప్రతీ సారి ఇదే గోసపడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ వంతెన నిర్మిస్తేనే తమ ఇబ్బందులు తప్పుతాయని పలువురు వేడుకున్నారు. ఇప్పటికైనా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు స్పందించి జగదాంబ ఒర్రెపై హైలెవల్ వంతెన మంజూరు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.