Records Seize | కోరుట్ల, నవంబర్ 28 : కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా మున్సిపల్ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్టర్ బుక్, వాహనాల మరమ్మత్తులు, డీజిల్ కొనుగోలు బిల్లులు, నిధుల ఖర్చులకు సంబంధించిన రికార్డులు, కులాయి పన్నుల బిల్లులకు సంబంధించిన రికార్డులను వారు పరిశీలించారు.
మున్సిపల్ కమిషనర్ రవీందర్, సిబ్బందిని విచారించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మున్సిపల్ లో తనిఖీలు నిర్వహించినట్లు, నిధుల వినియోగానికి సంబంధించి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ తహసీల్దార్ దినేష్, ఇంజనీరు సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.