Vemulawada | వేములవాడ రూరల్, సెప్టెంబర్ 19 : వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి కస్తూరిబా పాఠశాలలో విశ్వసర్పాలు రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కస్తూర్బా పాఠశాల ఆవరణలో విష సర్పాలు తరచూ సంచరిస్తున్నాయి. దీంతో ఆ పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూన్నారు. తరగతి గదిలో పాటు ఆఫీస్ కార్యాలయము పాఠశాల ఆవరణలో నిత్యం పాములు రావడం అవి చూసి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాములతో పాటు తేళ్లు, కుక్కలు పాఠశాలలో సంచరించడం వల్ల ఆరు బయట ఆడుకునేందుకు విద్యార్థులు జంకుతున్నారు. పాములు నిత్యం సంచరించడంతో రాత్రిపూట బయటకు రావడానికి విద్యార్థులు చంపుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తీసుకుని విష సర్పాలు పాఠశాలలో రాకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.