KalvaSrirampur | కాల్వ శ్రీరాంపూర్ జూన్ 6 : ఇటీవల వెలువడిన జాతీయస్థాయిలో నిర్వహించిన మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలలో కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన రేవెల్లి వెన్నెల స్కాలర్ షిప్ నకు ఎంపికైనట్లు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రంగు జగదీశ్వర చారి తెలిపారు. ఈ విద్యార్థినికి సంవత్సరానికి రూ.12వేల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు స్కాలర్షిప్ లభిస్తుందని అన్నారు.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పేద కుటుంబానికి చెందిన దంపతులు మౌనిక, కుమారస్వామి కూతురైన రేవెల్లి వెన్నెలను సర్పంచ్ ఆరెల్లి రమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఏఏపీసీ చైర్మన్ జంగ మహేశ్వరి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.