Attendant clicks dead females | మార్చురీలో మహిళా మృతదేహాల ఫొటోలు తీస్తున్న అటెండెంట్.. వైద్యాధికారి ఫిర్యాదుతో అరెస్ట్
Attendant clicks dead females | ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద విధులు నిర్వహిస్తున్న అటెండెంట్ మహిళా మృతదేహాల ఫొటోలను రహస్యంగా తీస్తున్నాడు. ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ఆసుప్రతి వైద్యాధికారి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద విధులు నిర్వహిస్తున్న అటెండెంట్ మహిళా మృతదేహాల ఫొటోలను రహస్యంగా తీస్తున్నాడు. ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ఆసుప్రతి వైద్యాధికారి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Attendant clicks dead females) కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీదర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ‘బ్రిమ్స్’ మార్చురీలో అటెండెంట్‌గా మునీర్ అహ్మద్ చాలా కాలంగా పని చేస్తున్నాడు. మార్చురీలో భద్రపరిచే మహిళా మృతదేహాల ఫొటోలను అతడు రహస్యంగా చిత్రీకరిస్తున్నాడు.
కాగా, పోస్ట్‌మార్టం సమయంలో ఎలాంటి చట్టపరమైన అనుమతి, అవసరం లేకుండా మహిళల మృతదేహాలపై ఉన్న దుస్తులు తొలగించి నగ్న ఫొటోలను మునీర్ అహ్మద్ తీశాడు. దీనిని గమనించిన ఒక డాక్టర్ అతడి మొబైల్ ఫోన్ పరిశీలించగా ఇలాంటి పలు ఫొటోలు కనిపించాయి. ఇది తెలుసుకుని డాక్టర్లు, వైద్య సిబ్బంది షాక్ అయ్యారు.
మరోవైపు బ్రిమ్స్ ప్రొఫెసర్, విభాగాధిపతి అయిన డాక్టర్ మోసినల్ హక్, మే 25న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మునీర్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

