KL Rahul: సెంచరీ కొట్టి ఔటైన కేఎల్ రాహుల్
KL Rahul: కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన ఖాతాలో సెంచరీ వేసుకున్నాడు. రాహుల్‌కు ఇది టెస్టుల్లో 12వ సెంచరీ. అయితే సెంచరీ పూర్తి అయిన వెంటనే అతను ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలు ఉన్నాయి.
న్యూ చండీఘడ్: కేఎల్ రాహుల్(KL Rahul) సెంచరీ నమోదు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన ఖాతాలో సెంచరీ వేసుకున్నాడు. రాహుల్‌కు ఇది టెస్టుల్లో 12వ సెంచరీ కావడం విశేషం. అయితే సెంచరీ కొట్టిన వెంటనే రాహుల్ ఔటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిలకడగా ఆడుతోంది. లంచ్ సమయానికి ఇండియా 96 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మళ్లీ టీ విరామ సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 209 రన్స్ చేసింది. ఉదయం ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 24 రన్స్ చేసి, రెండో సెషన్లో సాయి సుదర్శన్ 81 రన్స్ చేసి నిష్క్రమించారు. ఇక మూడవ సెషన్లో రాహుల్ ఔటయ్యాడు. ముల్లాన్‌పూర్‌లో జరుగుతున్న టెస్టులో సెకండ్ డౌన్లో వచ్చిన కెప్టెన్ గిల్ వేగంగా స్కోరు చేస్తున్నాడు.
కేఎల్ రాహుల్ తొలుత జైస్వాల్, ఆ తర్వాత సాయి సుదర్శన్, గిల్‌తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు. రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్లతో 100 రన్స్ చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 60.6 స్ట్రయిక్ రేట్‌తో అతను బ్యాటింగ్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం భారత్ 61 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది. గిల్ 39, పంత్ 2 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

