Dharmaram | ధర్మారం, ఆగస్టు 25: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఖిలావనపర్తి, దొంగతుర్తి, కొత్తూరు గ్రామాలలో సర్పంచులు మోతే కనకయ్య, కొడారి మంగ హనుమయ్య, భూక్య సంగీత ఆంజనేయులు ఆధ్వర్యంలో నాటారు.
నర్సింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో సర్పంచ్ బంగుటపు కొమురయ్య, పాఠశాల హెడ్ మాస్టర్ తుల శ్రీదేవి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల హెడ్మాస్టర్ శ్రీదేవి సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన షూలను స్థానిక సర్పంచ్ కొమురయ్య విద్యార్థులకు పంపిణీ చేశారు.