Joined BRS | ధర్మపురి, సెప్టెంబర్05; కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హమీలు అమలు చేయక పోవడంతో గ్రామస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న ప్రజలతో మాటలు పడలేక బుగ్గార మండలం బుగ్గారం, వెల్గొండ, సిరికొండ గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బుగ్గారం వేదికగా గులాబి కండువా కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ వైపల్యాలను గ్రామగ్రామాన ఎండగట్టాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఈశ్వర్ సూచించారు. పార్టీలో క్రమశిక్షణతో మెలుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు గ్రామానికి చేరుకున్న మాజీ మంత్రికి గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావ్, డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు తదితరులున్నారు.