Ullas | ఓదెల, ఆగస్ట్ 28 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో స్వశక్తి సంఘాల మహిళలకు 15 నుండి 35 సంవత్సరాలు వయసు ఉన్న నిరక్షరాశులను అక్షరాసులుగా మార్చేందుకు ఉల్లాస్ కార్యక్రమం చేపట్టారు.
ఇందులో కొలనూర్ ప్రధానోపాధ్యాయులు నిట్టూరి ఏసుదాస్ మాట్లాడుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు చెప్పారు. మహిళలందరికీ విద్యను అందించడమే ఈ ఉల్లాస్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ ఉపాధ్యాయుడు చేరాలు ఆర్పీగా వ్యవహరించగా, సుమారు 40 మంది వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.