Udaynandan Reddy | వీణ వంక, జూన్ 5 : మండలంలోని బొంతుపల్లి గ్రామంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపనకు యప్ టీవీ ట్యూరిటో సంస్థలు, వైయూపీపీ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళం అందజేశారు. బొంతుపల్లి గ్రామంలో గురువారం పోచమ్మ తల్లి, భులక్ష్మీ ,మహాలక్ష్మి బొడ్రాయి దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పాడి ఉదయ్ నందన్ రెడ్డి రూ.20 వేలు విరాళం పంపించారు. కాగా స్థానిక మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్, నాయకులు ఏ ప్రభాకర్, చిట్టి, అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు జనార్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నాయకులు చదువు జితేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.