ఇంటికెళ్లిన కొద్దిసేపటికే..
కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లోకిని రాజేందర్ (53) శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
- గుండెపోటుతో ఇద్దరు ఉద్యోగుల మృతి
- కోరుట్లలో ఏఎస్ఐ, కేశవపట్నంలో లైన్ఇన్స్పెక్టర్..
విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటుతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మృత్యువాతపడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కోరుట్ల/ శంకరపట్నం మార్చి 2: కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లోకిని రాజేందర్ (53) శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో శనివారం వేకువజామున మృతిచెందాడు. రాజేందర్ మృతదేహానికి మెట్పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు, ఎస్ఐ కిరణ్, పోలీస్ సిబ్బంది నివాళులర్పించారు. మృతుడికి భార్య పద్మ, కొడుకు సతీశ్, కూతురు శైలజ ఉన్నారు.
సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్..
శంకరపట్నం మండలం తాడికల్ విద్యుత్ సబ్ స్టేషన్లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుస్తున్న ఎన్పీడీసీఎల్ ఉద్యోగి సయ్యద్ అశ్వక్ హుస్సేన్ (60) శనివారం విధులు నిర్వహించిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. కరీంనగర్‌కు చెందిన ఆయనకు ఇతనికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఉద్యోగి మృతిపై ఏఈ సంపత్‌రెడ్డితో పాటు సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

