వీర్నపల్లి, అగస్టు 2: సహకార సంఘాల బలోపేతంతోనే కార్పొరేట్ శక్తులకు అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డా రు. రైతు సంఘాలే యజమానులుగా ఉండే సొ సైటీలను ప్రధాని మోదీ రైల్వే, ఎల్ఐసీ తరహా లో ప్రైవేటీకరణ చేసే అవకాశం లేదని చెప్పారు. ఆరువేల కోట్ల అప్పుల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని బతికించేందుకే సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏటా సబ్సిడీ కింద ఆర్టీసీకి 1500కోట్లు ఇస్తున్నదని తెలిపారు. వీర్నపల్లిలో కేడీసీసీ బ్యాంకు శాఖను న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. రా ష్ట్రం ఏర్పాటు చేస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని ఆంధ్రా సీఎం కిరణ్ కు మార్ నిండు అసెంబ్లీలో కించపరిచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రామగుండం, భూ పాలపల్లి, కొత్తగూడెంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండేవన్నారు.
ఉద్యమ కాలంలో పెద్దపల్లికి చెందిన ఓ రైతు రాత్రిపూట పొలంవద్దకు వెళ్తూ బావిలో పడి మరణించాడన్నారు. నాడు పరామర్శకు వెళ్లిన సందర్భంలో చలించిపోయామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్రం వచ్చినంక 24 గంటల కరెంట్ ఇద్దామని చెప్పారన్నారు. చెప్పి న మాట మేరకు తెలంగాణ సిద్ధించి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారన్నారు. 25 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తే లక్ష్యంగా యాదాద్రి, భద్రాద్రి పవర్ప్లాంట్లను నిర్మిస్తున్నారని చెప్పారు. ఇటీవలి వర్షాలకు గోదావరి, కృష్ణా నదుల నుంచి 11వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని తెలిపారు. అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలన లో గోదావరిపై ఎస్సారెస్పీ తప్పా ఇంకే పెద్ద ప్రాజెక్ట్ కట్టలేదని విమర్శించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, సమ్మక్క- సార క్క ప్రాజెక్టు నిర్మించిందని తెలిపారు దుమ్ముగూడెం వద్ద సీతమ్మ ప్రాజెక్టు నిర్మించామని వి వరించారు. ఇప్పుడు ప్రతి వ్యవసాయభూమికి నీరందుతుండడంతో వలసలు నిలిచిపోయాయని పేర్కొన్నారు.
రైతులు నిశ్చింతగా పంట లు పండించుకుంటున్నారన్నారు. అనంతరం కేజీబీవీ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ తీసుకోవాలని వి నోద్కుమార్కు వినతిపత్రం అందించగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హమీ ఇచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామరావు, జడ్పీటీసీలు గుగులోత్ కళావతి, చీటీ లక్ష్మణ్‌రావు, ఎంపీపీలు మాలోత్ భూల, పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్లు మా డ్గుల మల్లేశం, ప్యాక్స్ చైర్మన్లు ఉచ్చిడి మోహన్‌రెడ్డి, రామగిరి సుధీర్‌రావు, గుండారపు కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ చాంద్‌పాషా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, సర్పంచ్ పాటి దినకర్, ఉపసర్పంచ్ బోయిని రవి, ఎం పీటీసీ మల్లారపు అరుణ్‌కుమార్, బంజార సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేశ్‌నాయక్, సీఈవో సత్యనారాయణ ఉన్నారు.
రోడ్డులేకుంటే బైక్‌పై వెళ్లిన..
పదేళ్ల కింద వీర్నపల్లికి వచ్చినప్పుడు తండాలకు సరైనా రోడ్డు సౌకర్యంలేకుండేది. ఉన్నచోట కూడా గుంతలు ఉండేవి. ఈ పరిస్థితుల్లో అప్పటి ఎమ్మెల్యే కేటీఆర్‌తో కలిసి బైక్, ట్రాక్టర్ల వెళ్లాం. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద దత్తత తీసుకొని వీర్నపల్లిని అన్నింటా ముందునిలిపా. పెట్రోల్ బంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేశాం. 100 శాతం అక్షరాస్యత సాధించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా గ్రామస్తులు అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు ఆ తండాల్లో తారురోడ్లు, విద్యుత్ వెలుగులతో కనిపిస్తున్నాయి. వీర్నపల్లి లో 4కోట్లతో స్కూల్ భవనం నిర్మిస్తున్నాం.
– వినోద్ కుమార్
కేడీసీసీని లాభాల్లోకి తెచ్చినం..
2005లో కేడీసీసీబీ 70కోట్ల నష్టాల్లో ఉండేది. ఇప్పుడు 6వేల కోట్లతో లాభాల్లోకి తెచ్చినం. వీర్నపల్లిలో 70వ శా ఖను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో సోసైటీ పరిధిలోని పెట్రోల్ బంకులు మూతపడ్డయ్. కానీ, అల్మాస్పూర్ సొసైటీ పరిధిలో రెండు బంకుల తో పాటు కరీంనగర్‌లోని 40 బంకులను రిటైల్ అవుట్లెట్ పరిధిలోకి తీ సుకువస్తున్నం. ఇటీవల జారీ చేసిన పోడు పట్టాలకు నిబంధనలు సడలించి రుణాలు ఇచ్చేందుకు అలోచిస్తున్నం. వీర్నపల్లివాసులు కేడీసీసీ సేవలను వినియోగించుకోవాలి.
-కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్