మంథని, ఏప్రిల్2 : అట్టడుగు వర్గాల కోసం ఆనాడు త్యాగం చేసిన మహానీయుల చరిత్ర తెలుసుకొని, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బుధవారం సర్ధార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా మంథనిలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడారు. పోరాటయోధులైన సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలాంటి మహనీయుల స్ఫూర్తి, ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఆలోచనా విధానాలతో బీఆర్ఎస్ ఉద్యమాన్ని ముందుండి నడిపించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో అభివృద్ధి సంక్షేమం తో పాటు చరిత్రకారులు, ఉద్యమకారులతో పాటు బహుజనుల చరిత్రను వెలికి తీశామన్నారు. రాజ్యాం గం, ఓటు విలువ తెలిసి ఉంటే మనమే పాలకులుగా ఉండేవాళ్లమని గుర్తు చేశారు. సర్వాయి పాపన్న ఉద్యమ స్ఫూర్తిని నియోజకవర్గంలో ముందుకు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజు గౌడ్ జన్మదినం సందర్భంగా పుట్ట మధు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఏగోళపు శంకర్ గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్ యాదవ్, రాజు గౌడ్, ఆకుల బాపు, లొడారి రాములు, జంజర్ల శేఖర్, గొబ్బురి వంశీ, పుప్పాల తిరుపతి పటేల్ ఉన్నారు. కమాన్‌పూర్, ఏప్రిల్ 2: నాగారం పంచాయతీ పరిధి లింగాల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్ధార్ సర్వాయి పాపన్న సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బత్తిని నాగమణి, మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్‌రావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుమార్, లింగాల గౌడ సంఘం అధ్యక్షుడు నల్లగొండ నాగరాజ, నాయకులు కమ్మగోని భాస్కర్, బత్తిని శ్రీనివాస్, శంకరయ్య, బుర్ర రవి, వగ్లకొండ లక్ష్మణ్, లింగయ్య, మల్యాల ఓదెలు పాల్గొన్నారు.
ఓదెల, ఏప్రిల్ 2: మండల కేంద్రంలో గౌడ కులస్తులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్ఐ దీకొండ రమేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీ బోడకుంట చినస్వామి, కనికిరెడ్డి సతీశ్, వంగ రాయమల్లు, సూత్రాల శ్రీనివాస్, తీర్తాల వీరన్న, క్యాతం వెంకటేశ్వర్లు, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 2: సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు ఆర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే రంగారెడ్డి, ఆర్టీవో రంగారావు, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాసులు, పలువురు జిల్లా అధికారులు, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఎం.అంజయ్య గౌడ, నాయకులు బాలసాని వెంకటేశం గౌడ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.