Accident | ముత్తారం, జూన్ 11: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో వ్యక్తికి త్రీవగాయాలైన సంఘటన మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రం మొగిళి చెందిన ట్రాక్టర్ కు గ్రామానికి చెందిన గసిగంటి శీను డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన ఓ రైతు భూమిలో చదును చేస్తుండగా అదుపుతప్పి పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ నరేశ్ తెలిపారు.