Peddapally | మంథని, మార్చి 22 : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి క్రాస్ వద్ద వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న టాటా ఏస్ ట్రాలీ వాహనం బోల్తాపడ్డ సంఘటనలు 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు మల్లారంలో మిర్చి ఏరెందుకు తెల్లవారుజామున 6 గంటలకు గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తికి చెందిన టాటా ఏసీలో బయలుదేరారు.
నాగేపల్లి క్రాస్ వద్ద మంథని- కాటారం ప్రధాన రహదారిపై టాటా ఏసీ వాహనం స్టీరింగ్ రాడ్డు ఉసి రావడంతో వాహనం బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 16 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరిని మంథనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. గాయపడ్డ వారిలో బొందల కిష్టమ్మకు తలకు తీవ్రంగా గాయం కావడంతో పాటు చెవిలో నుంచి రక్తం వస్తుండడంతో కరీంనగర్ కు తరలించారు.
అదే విధంగా అప్పల శైలజకు చేయికి, అప్పల వనితకు భుజంకు తీవ్రంగా గాయమై పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని సైతం కరీంనగర్ కు తరలించారు. అదేవిధంగా గడ్డి మల్లక్క, సత్తమ్మ, సమత, ఎర్రమ్మ, కందుల రాజేశ్వరి, పోసక్క, కోలగాని సమ్మక్క, గౌరక్క, జంగ లక్ష్మి, కమ్మ బోయిన స్రవంతి, కమల, బోధ మల్లమ్మ లను కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రిలో గాయపడ్డ క్షతగాత్రులను మంథని సీఐ బి. రాజు, ఎస్సై రమేష్ లు ఆస్పత్రిని సందర్శించడంతోపాటు ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.