తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 7: రోడ్డును అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేశాయని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డా రు. గుండ్లపల్లి టూ పొత్తూరు వయా గన్నేరువరం డబుల్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 71 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా శనివారం ఆయన సీఎం కేసీఆర్, ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గన్నేరువరం నాయకులతో కలిసి గుండ్లపల్లి నుంచి గన్నేరువరం దాకా బైక్‌ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామగ్రామానా స్వాగతం పలికారు. క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సత్కరించా రు.
అనంతరం గన్నేరువరంలో జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలపై రెండేండ్ల కిందటే అసెంబ్లీలోనే మాట్లాడానని, త న విన్నపానికి 71కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, సహకరించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.
ప్రతిపక్ష నాయకులు రోడ్డును అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారని, చె ప్పుల దాడి చేసి అవమానపర్చారని ఆవేదన వ్య క్తం చేశారు. అయినా తాను ఏం మాట్లాడలేదని, రోడ్డు తీసుకవచ్చిననాడే మాట్లాడుతానని ఊరుకున్నానని చెప్పారు. రాజకీయాలంటే కేవలం ఎ దుటివారిని తిట్టుడు ఒక్కటే అన్నట్టు తయారైంద ని ఎద్దేవా చేశారు. అభ్యర్థులే దొరకని పార్టీలు.. ఎన్నికల్లో పోటీ చేస్తే చేసుకోండని, మాకేం భయం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నంతసేపు బీఆర్ఎస్దే విజయమని స్పష్టం చేశారు.
ఎంపీ ఒక్క రూపాయైనా తెచ్చిండా..?
బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు ఏటా 2కోట్లు నిధులు తెచ్చేవారని, ఇప్పుడున్న ఎంపీ ఒక్క రూపాయి అయినా ఇచ్చిండా..? అని ప్రశ్నించారు. అభివృద్ధిపై సోయి లేని నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.. పిల్లల జీవితాలు కరాబ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రెచ్చగొట్టడంతో ప్రభుత్వంపై సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంటే.. యువత ఉద్యోగాలకు సిద్ధం కాకుండా ఆగం చేస్తున్నారన్నారు. ఎవరైనా అసభ్యకరమైన పోస్టులు పెడితే చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సురేందర్‌కు సూచించారు. ప్రశ్నిస్తే తప్పులేదని, వ్యక్తిగత పోస్టులు పెట్టి.. ప్రశాంతమైన వాతావరణం ఉండే మండలాన్ని అతలాకుతలం చేస్తారా..? అని ప్రశ్నించారు. గన్నేరువరం మండలానికి ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని, 10లక్షలతో ఫిష్ మార్కెట్ కట్టబోతున్నామని, ఇండ్లు కూడా మం జూరు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమం లో ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గుడెల్లి తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న ఉన్నారు.