Indiramma’s house | తిమ్మాపూర్,జూన్27: ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ అన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సంయుక్తంగా అర్హులైన వారికి మాత్రమే ఇండ్లను కేటాయించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొందరు కుట్రలు పడుతున్నారని ఆరోపించారు.
ఏ గ్రామంలో ఎంక్వయిరీ చేసుకున్నా అర్హులనే ఎంపిక చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత మందికి సైతం అర్హులైన లబ్ధిదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, మోరపల్లి రమణారెడ్డి, గుజ్జుల రవీందర్ రెడ్డి, మాచర్ల అంజయ్య, ఎలుకపల్లి సంపత్, రెడ్డి గాని రాజు, పోలు రాము, రమేష్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.