CPI | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 12 : రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలినీ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. జాతీయ కమిటీ పిలుపు మేరకు నగరంలోని కామన్ చౌరస్తాలో శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు భంగం కలిగించే రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోడీ బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సంఖ్య బలంతో పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చి ఆమోదం తెలిపిందని ఆరోపించారు. సమానత్వం మతాన్ని అనుసరించే స్వేచ్ఛ భంగం కలిగించే విధంగా సవరణ చట్టాన్ని తెచ్చారని, దీనివల్ల మైనార్టీ సమాజం యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతిసే కుట్ర జరుగతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ టీడీపీ, జేడీయూ పార్టీల సహకారంతో ఓటింగ్ ద్వారా చట్టాన్ని ఆమోదం చేసుకోవడం సరియైంది కాదన్నారు.
ముస్లిం మైనారిటీలను అభివృద్ధి కాకుండా చేయాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని పార్లమెంటుకు తీసుకొచ్చిందన్నారని విమర్శించారు. నిజాం కాలంలో తెచ్చిన వక్ఫ్ బోర్డు ను ఇప్పుడు బీజేపీ వారి సైద్ధాంతిక ఆలోచనలకు అనుగుణంగా సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మైనార్టీలను అంచి వేయడానికి చూస్తుందని దుయ్యబట్టారు. వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం తీసుకురావడం సరైన పద్ధతి కాదన్నారు. వక్ఫ్ మైనార్టీల హక్కు అన్నారు దీనిపై ప్రభుత్వ నియంత్రణ తగదని పేర్కొన్నారు. కేంద్ర పునరాలోచన చేసుకొని కోట్లాది మంది మైనార్టీల ఆత్మ గౌరవ సమస్యగా భావించి వెంటనే వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపెల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కంది రవీందర్ రెడ్డి, కిన్నెర మల్లక్క నాయకులు సత్యం, కూన రవి, ఎంఏ బేబీ, ఆశీనా ఖాన్, సఫిన్ సుల్తానా, సాహిమ్ బేగం, రజియా, కాజామియా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.