siricilla | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 21: వరంగల్ లో ఈ నెల 27 న చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజ బింకార్ రాజన్న పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండల కేంద్రం లోని బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో తంగళ్ళపల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ మండల కేంద్రం నుంచి 300 మంది తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సభకు వచ్చే వారికి ఆరు బస్సులు ఏర్పాటు చేశామని, సభకు వచ్చేవారికి అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. సభ విజవంతానికి, ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. అనంతరం సభకు వచ్చే వారి జాబితాను మండలాధ్యక్షుడు రాజన్నకు పట్టణ అధ్యక్షుడు జగన్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు అంకరాపు రవీందర్, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడీ వెంకట రమణారెడ్డి, పడి గెల రాజు, మాజీ సర్పంచ్ కొడం సంధ్యారాణి, సద్ధ రోజా, క్యారమ్ జగత్, నేరెళ్ల అనిల్ గౌడ్, వెంగల రమేష్, వెంకట రంగం, పర్క పల్లి తిరుపతి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.