MLA Padi Kaushik Reddy | వీణవంక ఎంపీడీవో రవిసుధాకర్ సేవలు మరువలేనివి.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక ఎంపీడీవో రవిసుధాకర్ సేవలు మరువలేనివని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్హాల్లో సోమవారం ఎంపీడీఓ రవిసుధాకర్ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది.
MLA Padi Kaushik Reddy | వీణవంక, ఆగస్టు 31 : వీణవంక ఎంపీడీవో రవిసుధాకర్ సేవలు మరువలేనివని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్హాల్లో సోమవారం ఎంపీడీఓ రవిసుధాకర్ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో గతంలో ప్రత్యేకాధికారిగా పని చేసిన జడ్పీ డిప్యూటీ సీఈఓ పవన కుమార్, ఎంపీడీవో రవిసుధాకర్లను శాలువాలతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పని సరని, ఉద్యోగ సమయంలో ఎంపీడీఓ రవిసుధాకర్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పంచాయితీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది ఎంపీడీఓ రవిసుధాకర్‌కు పూలమాల వేసి, మొమోంటో అందజేసి, శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శోభారాణి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఆయాశాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

