Narender Reddy | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 13/(నమస్తే తెలంగాణ) : నిష్ణాతులైన అధ్యాపకులచే అత్యున్నత బోధన ద్వారా బాలల భవిష్యత్తుకు బడిలోనే బీజాలు ఏర్పడతాయని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా గురువారం సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా విద్యార్థులచే నిర్వహించారు.
ఈ సందర్భంగా అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, క్రమశిక్షణతో ఉన్నతమైన చదువులు చదువుకొని తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలకు గురువులకు పేరు ప్రఖ్యాతలు తేవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.