Pingali Sripal Reddy | జగిత్యాల, జూన్ 30 : ఈనెల 6 నుండి 19 వరకు జరగబోయే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. స్థానిక పొన్నాల గార్డెన్ జగిత్యాలలో పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఎస్ఎస్ సీ ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులదే అని అన్నారు. ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలని వారన్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించాలని వారు అన్నారు. త్వరలోనే మండల విద్యాధికారి పోస్టులు భర్తీ అవుతాయని, ప్రతీ జిల్లా కేంద్రంలో డైట్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారన్నారు.
దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న సిపిఎస్ రద్దు అవుతుందని, ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ ఇప్పిస్తామని వారన్నారు. ఈ సందర్భంగా 20 మంది మండల టాపర్ విద్యార్థులను సన్మానించారు 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల153 మంది ప్రధానోపాధ్యాయులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి రాము, విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన మహేందర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, మండల జిల్లా బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.