Collector Koya Sri Harsha | పెద్దపల్లి రూరల్, జనవరి 3: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ 2025 ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2025 ను వేగవంతంపై బీఎల్ వోల సమీక్షలో పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రతీ బూత్ పరిధిలో తప్పనిసరిగా ఇంటింటి సర్వే నిర్వహించి 100 శాతం మ్యాపింగ్ చేయాలని సూచించారు.
ఇంటింటి సర్వే సమయంలో ఓటర్ల వివరాలు తీసుకుని జాబితా మ్యాపింగ్ చేయాలన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితాలో భాగంగా 2025 వ సంవత్సరంలోని ఓటర్లను 2002 ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయుటకు తక్కువ పురోగతిలో ఉన్న బిఎల్ఓ ల పనితీరును పరిశీలించారు. నియోజక వర్గం పరిధిలోని బూత్ స్థాయి అధికారులు రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్ డీవో బొద్దుల గంగయ్య, పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్‌లతో పాటు సంబంధిత శాఖల అధికారులు, బీఎల్ వోలు పాల్గొన్నారు.