Chada Venkat Reddy | చిగురుమామిడి, సెప్టెంబర్ 24 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన రైతుల సీలింగ్ ల్యాండ్ భూములు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని సెక్రటేరియట్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి కోరారు. చాడ వెంకటరెడ్డి రైతులతో కలిసి గురువారం వినతి పత్రం అందజేశారు. 40 సంవత్సరాలుగా రైతుల సీలింగ్ భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ఇంతవరకు పరిష్కారం కాలేదని, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చాడ మంత్రికి వివరించారు.
ప్రభుత్వం ద్వారా రైతులకు అందే ప్రయోజనాలు చేకూరడం లేదని తెలిపారు. రైతుల సమస్యలు విన్న మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు రైతులు పేర్కొన్నారు. ఆయన వెంట రిటైర్డ్ ఏసీపీ బావు రవీందర్, సింగిల్విండో మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, రైతులు పరుపాటి వెంకటరెడ్డి, బావు సుధాకర్, చాడ సతీష్ రెడ్డి, మిర్యాల కనక రెడ్డి, రాగుల సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు.