Kolanur | ఓదెల, నవంబర్ 3 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని అతి పురాతన సాంబ సదా శివాలయం పునర్నిర్మాణం గ్రామస్తులు చేపట్టారు. జిల్లాలో మొదటిసారి పూర్తి రాయితో శివాలయాన్ని యధావిధిగా దాదాపు రూ.1.50 కోట్లతో పునర్నిర్మాణం చేపట్టారు. కాకతీయ కాలంలో నిర్మించిన ఈ ఆలయం పునర్నిర్మాణం చివరి దశకు చేరుకుంది. గర్భగుడి ఆలయం పై బ్రహ్మ కపాలం శిలను నెలకొల్పడానికి సోమవారం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శిలను గ్రామంలో శోభయాత్ర చేపట్టారు. వందల సంవత్సరాల కాలం నాటి శివాలయాన్ని పునర్నిర్మానం చేయడానికి గ్రామస్తులతో పాటు అనేకమంది భక్తులు విరాళాలను అందజేశారు. దీంతో వైభవంగా బ్రహ్మకపాలం ఏర్పాటు కార్యక్రమం పండుగ వాతావరణం లో గ్రామస్తులు నిర్వహించుకున్నారు. వేద పండితులు నందగిరి అశోక్ శర్మ, నందగిరి ముక్తేశ్వర్ శర్మ పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కలకొండ చిన్న రాజిరెడ్డి, డైరెక్టర్లు బండారి ఐలయ్య యాదవ్, ఓదెల నరేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ పర్ష రమేష్, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్, ఉప్పల వెంకటేశ్వర్లు, దేవరకొండ శ్రీనివాస్, బండారి సరిత, పర్ష పద్మ తదితరులు పాల్గొన్నారు.