Auto drivers | సుల్తానాబాద్ రూరల్, జూన్ 16: ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకుడు గుస్కుల సదయ్య కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామానికి చెందిన 15 మంది ఆటో డ్రైవర్లను సదయ్య ఆధ్వర్యంలో శాలువాలను కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఆటో డ్రైవర్ల యూనిఫాంలను ఆయన సొంత ఖర్చులతో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించాలన్నారు. రోజువారి ఆదాయం పోషణకు భారం అవుతుందని ఆటోలకు సంబంధించిన ఇన్సూరెన్స్, రైతుబంధు లెక్క ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల రమేష్ ,తిరుపతి , రాములు, బుజ్జయ్య ,శ్రీనివాస్, దేవి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.