
Election code | మంథని రూరల్, నవంబర్27 : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గ్రామాల్లో ఏర్పాటుచేసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం లేదు. మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఒక పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడం పట్ల ఆ గ్రామ ప్రజలు ఇతర పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీకి అధికారులు కొమ్ముకాస్తున్నారని అందుకే ఫ్లెక్సీలను తొలగించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.