Manthani | కమాన్ పూర్, ఏఫ్రిల్ 13: భారత రాజ్యాంగాన్ని విద్యార్థి దశలోనే అవగాహనా కల్పించేలా పాఠ్యంశాల్లో రాజ్యాంగాన్ని పొందుపర్చాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ దీక్షా -దివాస్ కార్యక్రమంలో భాగంగా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కే దక్కుతుందన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిని రెండు సార్లు ఓటమి చేసేందుకు ప్రయత్నించిన ఓ పార్టీ మళ్లీ అంబేద్కర్ వాదాన్ని ఎత్తుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంబేద్కర్ కు క్షమాపణ చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.
రాజకీయ స్వార్ధం కోసం పగటి వేషాలు వేసిన బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారాన్నారు. మంథని నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారి చరిత్రను ఆయా వర్గాలకు తెలియజేసే విధంగా కృషి చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కులు, అభివృద్ధి, అభ్యున్నతి కోసం పాటు పడుతున్న మంథని ఎమ్మెల్యే పుట్ట మధు కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.