Karimnagar | తిమ్మాపూర్, సెప్టెంబర్29: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కోడ్ అమలులో ఉంటే ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోలు, శిలాఫలకాలు కనిపించకూడదు. దీంతో గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో శిలాఫలకాలకు, విగ్రహాలకు, ముసుగులు వేస్తున్నారు.
ఇన్ఛార్జి ఎంపీడీవో సురేందర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో కార్యాలయంతో పాటు గ్రామాల్లో పంచాయతీలు ఇతర కార్యాలయాల్లో ముసుగులు వేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఫొటోలను తీసి పక్కన పెడుతున్నారు. షెడ్యూల్ విడుదల నుండే కోడ్ అమల్లో ఉంటుందని అధికార వర్గాలు ప్రకటించాయి.