TGPSC Exam | పోలీసు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా టీజీపీఎస్సీ పరీక్ష.. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ రిక్రూట్మెంట్ పరీక్ష పోలీసుల భారీ బందోబస్తు మధ్య శనివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
- 100 మందికి గాను 62 మంది హాజరు.. 38 మంది గైర్హాజరు
TGPSC Exam | రామగిరి, అక్టోబరు 24 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ రిక్రూట్మెంట్ పరీక్ష పోలీసుల భారీ బందోబస్తు మధ్య శనివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రెండు సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 100 మంది అభ్యర్థులకు గాను 62 మంది హాజరుకాగా, 38 మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి. విష్ణువర్ధన్ తెలిపారు. మరో ఇద్దరు అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో నిబంధనల ప్రకారం పరీక్ష రాసేందుకు పోలీసులు అనుమతించలేదు.
పరీక్ష నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ బుద్దె స్వామి, రామగిరి ఎస్సై టీ శ్రీనివాస్, మహిళా ఎస్సై స్రవంతి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ సైతం పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణను పరిశీలించింది. అధికారుల సమన్వయం, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

