Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 19 : తమతో కలిసి చదువుకున్న మిత్రుడు అకాలమృతిచెందడంతో ఆర్థిక చేయూతనందించి అతడి కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కొల్లూరి రవి 2002-03లో వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకున్నాడు.
ఇటీవల అకాలమృతిచెందడంతో సమాచారం తెలుసుకున్న తనతో కలిసి చదువుకున్న స్నేహితులందరూ కలిసి గురువారం వారి ఇంటికెళ్ళి అతడి కుటుంబ సభ్యులకు రూ.40 వేల500 లు ఆర్థిక సహాయం అందజేసి, భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రవి స్నేహితులు కోమల్‌రెడ్డి, సురేష్, శ్రీకాంత్, స్వామి, రత్నాకర్‌రెడ్డి, రాజిరెడ్డి, రత్నాకర్‌రెడ్డి (చిన్న), సంతాజీ, సరిత, రజిత, పూర్వ విద్యార్థులు ఉన్నారు.