Basantnagar | పాలకుర్తి: పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ లో స్వతంత్ర అభ్యర్థి పరికిపండ్ల రాము బుల్లితెర నటులతో చివరి రోజు జోరుగా ప్రచారం చేశారు. కార్తీకదీపం ఫేమ్ వంటలక్క గ్రామంలో శుక్రవారం వీధి వీధిలో తిరిగి స్వతంత్ర అభ్యర్థి పరికిపండ్ల రామును లేడీస్ పర్సు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
గ్రామానికి బుల్లితెర నటి రావడంతో పలువురు మహిళలు ఆశ్చర్యంగా కార్తీకదీపం ఫేమ్ వంటలక్కను చూసేందుకు వచ్చారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే పరికిపండ్ల రాము లాంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఓటేసి గెలిపించుకోవాలని ఆమె కోరారు.