మల్లాపూర్, ఏప్రిల్ 18: ఎల్కతుర్తిలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. శుక్రవారం మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించాలని గుర్తు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఇక్కడ పార్టీ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, నాయకులు కాటిపెల్లి ఆదిరెడ్డి, దేవ మల్లయ్య తదితరులు ఉన్నారు.
రాయికల్, ఏప్రిల్ 18: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పల్లె పల్లె నుంచీ కదులుదామని, జగిత్యాల నియోజకవర్గ సత్తా చాటుదామని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలో పట్టణ, మండల ముఖ్య నాయకులతో శుక్రవారం ఆమె సమావేశమై, మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. 27న గ్రామగ్రామాన పార్టీ జెండా ఎగురవేసి, సభకు బయలుదేరాలన్నారు. అనంతరం పలు వార్డుల్లో ర్యాలీగా బయలుదేరి చలో వరంగల్ సభ వాల్‌పోస్టర్‌ను అంటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు అనిల్, మండలాధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, కోఆర్డినేటర్ శ్రీధర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు రాణిసాయి, ఉదయశ్రీ, మండల ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు, మండల మహిళా అధ్యక్షురాలు స్పందన, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, రాజేశ్‌గౌడ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.