Sri Chaitanya | తిమ్మాపూర్, నవంబర్ 22: తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ముగింపు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఫార్మసీరంగంలో విప్లవత్మక మార్పులు రావలసిన అవసరం ఉందని, సాంకేతికత మరింత అవసరమని అన్నారు. ఫార్మసిస్ట్స్ యాస్ అడ్వకేట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ రామ్ నరసింహారెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.