Pending DA | సీపీఎస్ ఉద్యోగుల పెండింగ్ డీఏ వాయిదాల బకాయిలను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయుల నిరసన
తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పాఠశాల సముదాయ సమావేశంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.
Pending DA | సారంగాపూర్, ఫిబ్రవరి 23 : తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పాఠశాల సముదాయ సమావేశంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేష్ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం సకాలంలో వీటిని చెల్లించకుండా వాయిదాల సంఖ్యను పెంచుకుంటూ పోవడం వల్ల వాయిదాల ద్వారా రావాలసిన మొత్తం సుమారు రూ.1200 కోట్లకు చేరడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతీ నెల విడుదల చేస్తున్న రూ.700 కోట్ల నిధులలో భాగంగా ఫిబ్రవరి నెల తప్పనిసరిగా సీపీఎస్ బకాయిల కోసం కేటాయించాలని కోరారు. గత ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్, శ్రీనివాస్, శంకర్, శ్రీనివాస్, ప్రవీణ్, ఉమేష్, మురళి, మునీందర్, రాజు, శ్రవణ్, నవీన్, వసంత, రేఖ, హేమలత, శ్రీలత, వాసవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

