హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 31: ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురసరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులు ముందస్తు వేడుకలు జరుపుకొన్నారు. కాలేజీలు, పాఠశాలల్లో కేక్‌లు కట్ చేశారు. మిఠాయిలను పంచిపెట్టారు. అధ్యాపకులతోపాటు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కాలేజీ, ఏకశిల సీబీఎస్ పాఠశాల, శాతవాహన, ఆదర్శ, మాంటిసోరి, కేరళ, వివేకవర్ధిని, న్యూ కాకతీయ, శ్రీ కాకతీయ, విజ్ఞాన్, టెట్రా హెడ్రాన్ తదితర పాఠశాలల్లో హెచ్ఎంలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్ల మార్గదర్శకంలో వేడుకలు నిర్వహించుకున్నారు.
సైదాపూర్, డిసెంబర్ 31: మండలకేంద్రంతో పాటు పలు విద్యాలయాల్లో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. పరస్పరం న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
జమ్మికుంట రూరల్, డిసెంబర్ 31: పట్టణంలోని న్యూమిలీనియం పాఠశాలలో ముందస్తు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శనివారం వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి కేక్ కట్ చేశారు. స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్ధులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇక్కడ పాఠశాల హెచ్ఎం వరుణ్ రెడ్డి, హైస్కూల్ హెచ్ఎం విశ్వనాథ్‌రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తహసీల్ కార్యాలయంలో..
ఇల్లందకుంట, డిసెంబర్ 31: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాధవి ఆధ్వర్యంలో శనివారం ముందస్తు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. స్వీట్లను పంపిణీ చేశారు. సిబ్బంది పరసర్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇక్కడ డీటీ వరలక్ష్మి, సీనియర్ అస్టిసెంట్ రవీందర్రావు, వీఆర్ఏలు, రేషన్ డీలర్లు ఉన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో..
హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 31: మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలోనీ అంగన్వాడీ కేంద్రంలో శనివారం సెక్టార్ సమావేశం అనంతరం ముందస్తు న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఏసీడీపీవో మణెమ్మ, స్థానిక సర్పంచ్ కోడిగూటి శారదాప్రవీణ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారులు, బాలింతలు పాల్గొన్నారు.