కరీంనగర్ రూరల్, డిసెంబర్ 9: ముంబైకి చెందిన రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు ఆర్ట్స్ పోటీలో నగునూర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులు పలు పతకాలు గెలుపొందారని హెచ్ఎం కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రంగోత్సవ్‌లో వివిధ పాఠశాలకు చెందిన 110 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. నగునూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది మందికి బంగారు పతకాలు, ఐదుగురికి వెండి పతకాలు, రెండు ట్రోఫీలు, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చాయని తెలిపారు.
పాఠశాల విద్యార్థులు 17 మంది పోటీలో పాల్గొనగా కార్టూన్ అంశంలో బీ కార్తిక్ (9వ తరగతి)కి జాతీయస్థాయిలో 4 వ బహుమతి వచ్చిందన్నారు. విద్యార్థులతో పాటు పాఠశాల ఆర్ట్ టీచర్ దేవునూరి అశోక్‌కుమార్‌కు కళాభూషణ్ అవార్డు ఆవార్డు, హెచ్ఎంకు కృతిశీల ప్రధ్యాపక్ పురస్కారం , విద్యార్థులకు మెడల్స్, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.