Powerlifting competition | కోరుట్ల, డిసెంబర్ 26: కోరుట్ల పట్టణానికి చెందిన యువకులు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ పోటీల్లో ప్రతిభ కనపరిచారు. హైదరాబాదులోని జీహెచ్ఎంసీ క్రీడా మైదానంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ స్పోర్ట్స్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటేషన్లో పట్టణానికి చెందిన ఉరుమడ్ల మహేష్ మాస్టర్ వన్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించారు.
అలాగే సీనియర్ కేటగిరీలో కల్లెడ రోహిత్ సిల్వర్ మెడల్, సబ్ జూనియర్ కేటగిరీలో ఉరుమడ్ల మాన్విత్ బ్రౌంజ్ మెడల్, జూనియర్ కేటగిరీ విభాగంలో చందు ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రతిభ చూపిన యువకులను పలువురు అభినందించారు.