కమాన్చౌరస్తా, జూలై 30 : అఖిల భారత స్థాయిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన జీ ప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీశైలం ఒక ప్రకటనలో తెలిపారు.
17 మంది విద్యార్థులు జీ నం దిని, వై స్నేహ, ఏ రమ్య, ఏ లోకేశ్, ఎం సా యికిరణ్, జీ ప్రత్యూష, పీ నవిత, డీ మేఘన, బీ పల్లవి, కే శివాని, ఎం ప్రవళిక, బీ మోహన్, సీహెచ్ చక్రధర్, ఎన్ శిరీష, ఎం నితిన్, డీ విజయ్, కే ప్రభాస్ అర్హత సా ధించినట్లు వివరించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఇన్చార్జి వీసీ సురేంద్ర మో హన్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం వరప్రసాద్ విద్యార్థులను అభినందిస్తూ, విశ్వవిద్యాలయ కళాశాల చరిత్రలో ఇలాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. కళాశాల సహాయ రిజిస్ట్రార్ వై కిశోర్, అధ్యాపకులు డాక్టర్ బీ భాగ్యలక్ష్మి, జీఎల్ అర్చన, డాక్టర్ సీహెచ్ అనిల్కుమా ర్, డాక్టర్ కే తిరుపతి, పీ క్రాంతి రాజు, జే అశ్విని విద్యార్థులను అభినందించారు.