Tadikal | అనారోగ్యంతో తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత (35) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఆరోగ్యంగా ఉన్న ఆమె, వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Tadikal | శంకరపట్నం, సెప్టెంబర్ 20 : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత (35) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఆరోగ్యంగా ఉన్న ఆమె, వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు.
మృతురాలికి భర్త తిరుపతి, నేవీలో ఉద్యోగం చేస్తున్న కుమారుడు, బీటెక్ పూర్తి చేసిన కుమార్తె ఉన్నారు. చిన్న వయస్సులోనే ప్రజాసేవలో ఉన్న సర్పంచ్ సుజాత అకస్మాత్తుగా మృతి చెందడంతో తాడికల్ గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

