గంగాధర, ఫిబ్రవరి16 : ఈనెల 17న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున మొక్కలు నాటి వృక్షార్చన(Vruksharchana )కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్(Sunke Ravi Shankar) సూచించారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని ఆయన నివాసంలో మొక్కలు నాటారు.
2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హరితహారం కార్యక్రమంతో కోట్లాదిగా మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు అంకురార్పణ చేసిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందన్నారు. కేసీఆర్ హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు రూపకల్పన చేసి దేశవ్యాప్తంగా మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 17న వేలాదిగా మొక్కలు నాటి కేసీఆర్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, నాయకులు దూలం శంకర్ గౌడ్, గడ్డం స్వామి, తదితరులు ఉన్నారు.