Dharmaram | ధర్మారం, నవంబర్ 26: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్యస్వామి షష్టి(జన్మదినోత్సవ)రోజున వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు చేశారు.
ఈ సందర్భంగా దీక్షా స్వాములు స్వాములు భక్తి గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటిపల్లి సునీత- ఈశ్వర్ గురుస్వామి , ఆలయ పూజారి బీవి నర్సింగారావు, అయ్యప్ప దీక్ష స్వాములు ,భక్తులు పాల్గొన్నారు.