Sultanabad | సుల్తానాబాద్ రూరల్, జూలై 19: విద్యార్థులు అంకితభావంతో విద్యను అభ్యసించాలని సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కందునూరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హనుమండ్లపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలను శనివారం ఎంఈవో రాజయ్య సందర్శించారు.
గంధం లక్ష్మీనారాయణ విద్యార్థులకు 80 నోట్ బుక్స్, పెన్నులతోపాటు తదితర సామగ్రిని వితరణ చేయగా ఎంఈవో చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో రాజయ్య మాట్లాడుతూ విద్యార్థులకు తన వంతు సహాయక సహకారాలను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.