సుల్తానాబాద్, మార్చి 13 : విద్యార్థులు ఉన్నత లక్ష్యం వైపు పయనించేందుకు ఇష్టపడి చదువును కొనసాగించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని అల్ఫోర్స్ పాఠశాలలో డిజైర్ పేరిట వార్షికోత్సవాన్ని నిర్వహించగా, ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమతాకృష్ణ ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు జడ్పీటీసీ వినుపాల స్వరూపా ప్రకాశ్‌రావు, ఎలిగేడు ఎంపీపీ స్రవంతి, సాయిరి మహేందర్, ప్రకాశ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.