మల్యాల ప్రభుత్వ అధ్యాపకుల ఔదార్యం
మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని ఎనిమిది నుంచి పది గ్రామాల విద్యార్థులు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4.30 వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు.
మల్యాల, జనవరి 5 : మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని ఎనిమిది నుంచి పది గ్రామాల విద్యార్థులు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4.30 వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే, పిల్లలు ఉదయమే వస్తుండడంతో చాలా వరకు లంచ్ బాక్స్ తెచ్చుకోవడం లేదు. దీంతో ఆకలికి తట్టుకోలేక సాయంత్రం దాకా పాఠాలు వినడం లేదు. మధ్యాహ్న సమయంలోనే తిరిగి ఇండ్లకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఇక్కడి అధ్యాపకులు ఔదార్యం చాటారు.
తమ కాలేజీకి వచ్చే 250 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తరహాలో అల్పాహారం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బంది తమవంతు సహాయంగా కొంత నగదును సమకూర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచే ప్రారంభించారు. మొదటి రోజు వంద మంది విద్యార్థులకు భోజనం, మరో వంద మంది విద్యార్థులకు ఉప్మా అందించారు. అల్పాహారం కార్యక్రమాన్ని వార్షిక పరీక్షల (మార్చి ఒకటో తేదీ) వరకు కొనసాగిస్తామని ప్రిన్సిపాల్ శివరామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమలో అధ్యాపకులు అత్తినేని శ్రీనివాస్, శ్రీధర్, శ్రీనివాస్, రచన, పూర్ణిమ, సంధ్య, నరేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

