Strict action | మల్లాపూర్, జూలై 4: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్లాపూర్ తహసీల్దార్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. మండలంలోని చిట్టాపూర్ గ్రామశివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నరెండు ట్రాక్టర్లను శుక్రవారం పట్టుకోని సీజ్ చేసినట్లు స్థానిక తహసీల్దార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటమాని పేర్కోన్నారు. ఇక్కడ ఆయన వెంట నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రాజేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.