Quality Seeds | పెద్దపల్లి రూరల్ నవంబర్ 21 : భవిష్యత్లో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లిలో గల రైతువేదికలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గల పలు పరిశోదన కేంద్రాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
నూతన విత్తన బిల్లు-2025 ముసాయిదా పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. చర్చా గోష్టి ద్వారా కార్యక్రమానికి వచ్చిన భాగస్వామ్యుల నుండి అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు సలహాలు చేశారు. కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ సహా సంచాలకులు శ్రీనాథ్, శ్రీకాంతా రావు, అంజని, కరీంనగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ హరి కృష్ణ, డాక్టర్ ఎం రాజేంద్రప్రసాద్, వ్యవసాయ పరిశోధన స్థానం, శాస్త్రవేత్త, కూనారం రైతు విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ సంపత్, విత్తన ధ్రువీకరణ సంస్థ, కరీంనగర్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ కిషోర్, మండల వ్యవసాయ అధికారులు, మండల ఉద్యానవన అధికారులు, సీడ్స్ మెన్ అసోసియేషన్ సభ్యులు రైతు ఉత్పత్తి దారుల సంఘం ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.