Bhu Bharati | పెద్దపల్లి, జూన్ 24: భూ భారతి రెవెన్యూ సదస్సుల కింద వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15వరకు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్లు అరుణ శ్రీ, వేణు పాల్గొన్నారు.
వన మహోత్సవం , ఇందిరమ్మ ఇండ్ల, ఎరువుల లభ్యత, ఆయిల్ పామ్ సాగు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వంటి పలు అంశాలపై సీఎస్ జిల్లా అధికారులకు సూచనలు చేశారు. అటవీ ప్రాంతంలో కోతులకు అవసరమైన పండ్ల మొక్కలను పెద్ద ఎత్తున బ్లాక్ ప్లాంటేషన్ పెంచాలన్నారు.
జిల్లాలకు కేటాయించిన వన మహోత్సవం టార్గెట్ను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వీసీలో కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పాటు పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు గంగయ్య, సురేష్, డీఏవో దోమ ఆదిరెడ్డి, డీఎఫ్వో శివయ్య, డీఆర్డీవో ఎం. కాళిందిని, డీఎంహెచ్వో అన్న ప్రసన్న కుమారి, జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.